![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -918 లో... రేఖకి రాజ్ పాస్తా ఆర్డర్ చేసి ఇవ్వడం కావ్య చూసి కోపంగా లోపలికి వెళ్తుంది. ఆ విషయం ఇందిరాదేవికి చెప్పగానే రాజ్ ఎలాంటి వాడో తెలుసు కదా అని ఇందిరాదేవి అంటుంది. తెలుసు కానీ అతన్ని ఆటపట్టిస్తానని కావ్య చెప్తుంది.
మరొకవైపు సాండి డబ్బున్న సూట్ కేసుని రాహుల్ కి ఇస్తాడు. ఇది ఎలాగైనా రాజ్ కార్ లో పెట్టాలని అనుకుంటాడు. ఆ తర్వాత కావ్యకి రాజ్ భోజనం తీసుకొని వచ్చి తినమంటాడు. వద్దని తను అలుగుతుంది. వెళ్లి మీ రేఖకి తినిపించండి అని కావ్య అలుగుతుంటే బుజ్జగించి భోజనం తినిపిస్తాడు రాజ్. అదంతా రేఖ చూస్తుంది.
ఆ తర్వాత రాహుల్ సూట్ కేసు పట్టుకొని రాజ్ కార్ దగ్గరికి వస్తాడు. అప్పుడే అప్పు వచ్చి.. ఏంటి రాహుల్ అలా రాజ్ కార్ వంక చూస్తున్నావని అడుగుతుంది. ఏం లేదని రాహుల్ కంగారుపడతాడు. ఆ సూట్ కేసు ఏంటి.. నీకు ఎందుకు చెమటలు పడుతున్నాయని అప్పు అడుగుతుంది. అప్పుడ్ స్వప్న వచ్చి ఏంటి నా భర్త ఏమైనా క్రిమినల్ అనుకుంటున్నావా.. ఎందుకు అలా క్వశ్చన్ చేస్తున్నావని అంటుంది. అదేం లేదు అక్క అని అప్పు అంటుంది. నా ఫ్రెండ్ ఫారెన్ వెళ్తూ సూట్ కేసు ఇంట్లో ఇమ్మన్నాడు. నేను ప్రొద్దున ఇద్దామని ఇంటికి తీసుకొని వచ్చానని రాహుల్ చెప్తాడు. కానీ రాహుల్ పై అప్పుకి డౌట్ వస్తుంది.
ఆ తర్వాత కత్తితో రేఖ చేయి కోసుకోబోతుంటే రాజ్ వచ్చి వద్దని ప్రేమగా మాట్లాడతాడు. మరొకవైపు నాకు రాహుల్ పై డౌట్ ఉందని కళ్యాణ్ తో అప్పు చెప్తుంది. అదంతా ఏం పట్టించుకోకు రాహుల్ మారిపోయాడని కళ్యాణ్ చెప్తాడు.
ఆ తర్వాత రుద్రాణి దగ్గరికి రేఖ వెళ్లి.. అసలు నాకేం కావాలో పట్టించుకోవడం లేదని కోప్పడుతుంది. సరే చెప్పు నీకు ఏం కావాలోనని రుద్రాణి అనగానే నాకు బావ కావాలి.. తన ప్రేమ కావాలి అని రేఖ అనగానే రుద్రాణి షాక్ అవుతుంది. అది జరగదని రుద్రాణి అనగానే ఎందుకు జరగదు.. జరుగుతుందని రాహుల్ ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు కావ్య కడుపు లో బిడ్డ లేకుండా చేస్తే మరొక బిడ్డని కనడానికి కావ్యకి ఎలాగు ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పారు. సో ఇప్పుడు ఆ బిడ్డని లేకుండా చేస్తే ఇంటికి వారసత్వం కావాలి కాబట్టి రాజ్ కి కావ్య దగ్గరుండి మరి మళ్ళీ పెళ్లి చేస్తుందని రాహుల్ చెప్తాడు. దాంతో రేఖ, రుద్రాణి సరే అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |